రెడ్డిపల్లి గ్రామంలో 120 క్వింటాళ్లరేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

రెడ్డిపల్లి గ్రామంలో 120 క్వింటాళ్లరేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

వీణవంక, వెలుగు: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడం రమేశ్‌‌‌‌‌‌‌‌..  పలు గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించారు.

120 క్వింటాళ్ల బియ్యం సేకరించి డీసీఎం వ్యాన్‌‌‌‌‌‌‌‌లో తరలిస్తుండగా రెడ్డిపల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. వాహనాన్ని పీఎస్‌‌‌‌‌‌‌‌కు తరలించి నిందితులద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.